తెలంగాణలో ఆర్టీసీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదన్నారు మంత్రి పేర్ని నాని. గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

రాష్ట్రంలో కార్మికుల విలీన ప్రక్రియకు ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని, ఆర్టీసీ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉన్నారని ఆయన కూడా విలీనానికి అంగీకరించారని నాని తెలిపారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతికపరమైన అంశం మాత్రమేనని.. విలీనానికి ఇబ్బంది లేకుండా సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం ఏపీ, తెలంగాణలకు విడి విడిగా ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు నిధులు ఎలా కేటాయించిందని పేర్ని నాని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి విషయంపైనా ఆయన స్పందిస్తూ.. ఆయనను వైసీపీలోకి రమ్మని ఎవరు ఆహ్వానించారని ప్రశ్నించారు.

Also Read:rtc strike: ఆర్టీసీపై కేంద్రం వాదన ఇదీ: కేసీఆర్‌కే కాదు జగన్‌కూ తలనొప్పి

రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డితో తమకేం పనిలేదని నాని తేల్చిచెప్పారు. బస్సుల సీజ్‌ల విషయంలో దివాకర్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహారిస్తోందని పేర్ని నాని వెల్లడించారు. 

ఆర్టీసీ విభజన అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఏపీ ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. 

Also Read:ఆ ఉద్దేశం ఉందా, లేదా: ఆర్టీసీ సమ్మె కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

గురువారం నాడు ఏపీ సీఎం జగన్ ఆర్టీసీ పై జరిగే సమయంలో తెలంగాణలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ విభజన జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వాన్ని కూడ ఆలోచనలో పడేసినట్టుగా సమాచారం.

ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్  అంగీకరించారు. ఇదే ప్రధానమైన  డిమాండ్‌తో తెలంగాణలో  ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

ఆర్టీసీ లో రాష్ట్ర ప్రభుత్వం వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడ వాటా ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా రాస్ట్ర ప్రభుత్వానిది. 2014 ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014ను తెచ్చింది అప్పటి కేంద్రం.

Also Read:RTC Strike: ఆర్టీసీపై కీలక ప్రకటన... సమీక్షా సమావేశంలో కేసీఆర్ నిర్ణయమిదేనా..?

ఉమ్మడి ఏపీ రాష్ట్రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విభజన చేయడంతో  రాష్ట్రంలోని 9,10 వ షెడ్యూల్ సంస్థలతో పాటు ఇతర  సంస్థల విభజనకు కూడ కొన్ని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కొన్ని సంస్థల విభజన పూర్తి కాలేదు. ముఖ్యంగా 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనతో పాటు, ఉద్యోగుల విభజన తదితర అంశాలు రెండు రాష్ట్రాల మధ్య కీలకంగా మారాయి. ఈ  రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు ప్రయత్నాలు చేస్తున్నారు.