గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని విమర్శించారు. జగన్ సీఎం కావడం భ్రమ మాత్రమేనంటూ విరుచుకుపడ్డారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది పగటి కలలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతాడని తెలిసే ఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదని ఎద్దేవా చేశారు. 

మరోవైపు ఎన్నికల సంఘంపై మండిపడ్డారు మంత్రి పత్తిపాటి. ఏపీలో ఎన్నికల కోడ్ పేరుతో ఈసీ ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. పరిస్థితులను బట్టి ఈసీ కోడ్ ను సవరించాలని సూచించారు. 

ఏపీపై ఈసీ అవలంభిస్తున్న తీరు సరికాదన్నారు. బాధ్యత కలిగిన వారు సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటని నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల సమీక్షలను అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ఈసీని నిలదీశారు. ఎన్నికల తర్వాత జగన్ ఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదు. జగన్ అధికారం కోసం కలలు గంటున్నారు.