టీడీపీ వ్యవస్థాపకుడు, మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతించడంతో తెల్లవారుజామునుంచే అభిమానుల హడావుడి మొదలైంది.

కాగా.. ఏపీ మంత్రి నారాయణ కూడా ఒక సామాన్య ప్రేక్షకుడిలా సినిమా చూసేందుకు నెల్లూరులోని ఓ థియేటర్ కి వచ్చారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనేంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఎన్టీఆర్ కథను వెండితెరకెక్కించిన బాలయ్యకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
 
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బుధవారం ఉదయం విడుదల అయింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు చిత్ర బృందం కూడా వచ్చింది. హీరో బాలకృష్ణ, విద్యాబాలన్, క్రిష్, కల్యాణ్ రామ్, నిర్మాత సాయి అభిమానులతో కలిసి సినిమా చూశారు.