హైకోర్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని..కనీస అవగాహన లేకుండా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి అందరి భాగస్వామ్యంతో జరిగిందని రాజధాని లేని ఏపీ అభివృద్ధికి కేసీఆర్ సహకరమివ్వకపోవడం తగదన్నారు.

హైకోర్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని..కనీస అవగాహన లేకుండా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి అందరి భాగస్వామ్యంతో జరిగిందని రాజధాని లేని ఏపీ అభివృద్ధికి కేసీఆర్ సహకరమివ్వకపోవడం తగదన్నారు.అమరావతి నిర్మాణం కోసం ఒక తెలుగువాడిగా కేసీఆర్ కేంద్రంతో పోరాడాలని అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రానికి సాయం చేయని బీజేపీని కేసీఆర్ సపోర్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక తెలుగువాడిగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఏపీ కి సపోర్ట్ చేయాలని అన్నారు.ఏపీ సచివాలయ నిర్మాణంలో రాఫ్ట్ టెక్నాలజీ వినియోగంపై కేసీఆర్ వక్రీకరించి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 

5 టవర్లకు రాఫ్ట్ టెక్నాలజీతో 4 మీటర్లతో ఫౌండేషన్ వేసి బిల్డింగ్ నిర్మాణానికి డయా గ్రిడ్ ఫామ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు. డయా గ్రిడ్ ఫామ్ టెక్నాలజీతో భవనాల నిర్మించడం భారతదేశంలో మరెక్కడా లేదని ఈ విషయంపై కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడటం తగదని మంత్రి నారాయణ అన్నారు.