అమరావతి: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమికి విజయవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంటింటికి నీళ్లిస్తేనే ఓట్లు అడుగుతానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రమంతటా ఇంటింటికి నీళ్లు వస్తున్నాయా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప హైదరాబాద్ లో కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు.  

ఆంధ్రాలో కూడా వేలుపెడతానని మంత్రి కేటీఆర్ అన్న వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. కేటీఆర్ ఆంధ్రాకు వస్తావా రా అంటూ ఆహ్వానం పలికారు. ఆంధ్రాలో నిర్భయంగా ప్రచారం చేసుకోమన్నారు. ఏపీలో ప్రశాంత వారణం ఉంటుందని తెలిపారు. 

మరోవైపు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నారంటున్న టీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని ఎక్కడ అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని అలాగే అధికార పార్టీ  ధనిక పార్టీ అంటూ సెటైర్ వేశారు మంత్రి నారా లోకేష్.