పవన్ అంటే గౌరవం, కానీ అందుకే బాధ: లోకేష్

Ap minister Nara Lokesh reacts on Pawan allegations
Highlights

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదని  ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన  పవన్‌కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. 

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదని  ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్  చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన  పవన్‌కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. 

బుధవారం నాడు ఏపీ మంత్రి నారా లోకేష్  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  గతంలో కూడ తనపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. టీటీడీ సభ్యులు శేఖర్ రెడ్డితో తనకు సంబంధాలున్నాయని  చెప్పారని... కానీ ఆ విషయాన్ని రుజువు చేయలేకపోయారన్నారు.

ఇంకా కూడ తనపై  ఆరోపణలు చేస్తున్నారని వాటిని రుజువు చేయాలని పవన్ కళ్యాణ్‌కు లోకేష్ సవాల్ విసిరారు. తనకు పవన్ కళ్యాణ్‌ అంటే గౌరవం ఉందని ఆయన చెప్పారు. తాను అవినీతి పరుడినైతే  ఏపీలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఎందుకు  పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన సమయంలో ఆయన ఏ రకంగా బాధ పడ్డారో.... తనపై కూడ పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేసిన సమయంలో తాను కూడ అదే రకంగా బాధపడ్డానని ఆయన చెప్పారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేత వైఎస్ జగన్ ఎప్పుడు ఏం మాట్లాడారో ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు.
అందుకే ఏపీ ప్రజలు  అనుభవం ఉన్న నాయకుడిని  సీఎంగా ఎన్నుకొన్నారని  ఆయన చెప్పారు. 
 

loader