సానుభూతి కోసం వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు.  ఇటీవల జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే.  కాగా.. దీనిపై తాజాగా జగన్ తల్లి విజయమ్మ మీడియాతో మాట్లాడారు.

కాగా.. ప్రజల్లో సానుభూతి కోసమే విజయమ్మ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఆనందబాబు ఆరోపించారు. విజయమ్మ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కోడికత్తి డ్రామా రక్తికట్టలేదని విమర్శించారు. గంటసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోయే గాయానికి రాజకీయం చేశారని మండిపడ్డారు. 

జగన్‌ మళ్లీ పాదయాత్ర చేస్తున్నారని..ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేకపోతే తెలంగాణ పోలీసులను తెచ్చుకోవాలని మంత్రి నక్కా ఆనందబాబు హితవు పలికారు.