ప్రభుత్వాన్నే కట్ చేస్తా... మంత్రి సంచలన వ్యాఖ్యలు

Ap minister manikyala rao  fires on govt
Highlights

  • చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై సాక్ష్యాత్తు మంత్రివర్గ సభ్యుడే తీవ్రంగా ధ్వజమెత్తారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై సాక్ష్యాత్తు మంత్రివర్గ సభ్యుడే తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. బుధవారం తన నియోజకవర్గం తాడేపల్లి గూడెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. తన నియోజకవర్గంలో తననే అంటరానివాడిగా చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల శంకుస్ధాపన కార్యక్రమాలకు తననే దూరంగా పెడుతున్నారంటూ మండిపడ్డారు.

మూడున్నరేళ్ళుగా తాను ఓపిక పడుతున్నా ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. తనను నిలదీయాలని ప్రయత్నిస్తే తానే ప్రభుత్వాన్ని నిలదీస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు. తాను ప్రశ్నించటం మొదలుపెడితే చాలామందికి బాధ కలుగుతుందన్నారు. ‘నన్ను కట్ చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ నే కట్ చేస్తా’ అంటూ చేసిన హెచ్చరికలు సంచలనంగా మారింది. తన సహనానికి కూడా హద్దులుంటాయన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కలిసి పనిచేస్తున్నపుడు తనకు ఎదురయ్యే పరిస్ధితి ఏంటంటూ మండిపడ్డారు.

loader