ఏపీ మంత్రి లోకేష్..సింగపూర్ పర్యటనకు వెళ్లారు.  మూడురోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లిన లోకేష్ కి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఎన్ఆర్ఐలు, టీడీపీ నేతలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. 

సింగపూర్ ప్రభుత్వం అందించే అరుదైన గౌరవాన్ని మంత్రి లోకేష్ స్వీకరించనున్నారు. సింగపూర్ ప్రభుత్వం లోకేష్‌కు ఎస్‌ఆర్‌నాథన్ ఫెలోషిప్ ప్రకటించింది. సింగపూర్ ఆరవ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌నాథన్ సేవలను స్మరిస్తూ ఈ ఫెలోషిప్‌ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లో పలువురు మంత్రులతో లోకేష్ సమావేశంకానున్నారు.