బాలకృష్ణ ఆటలో అరటిపండు వంటి వాడని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ చదవడం తప్ప బాలకృష్ణ చేసేదేమీ లేదన్నారు.

అమరావతి: బాలకృష్ణ ఆటలో అరటిపండు వంటి వాడని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ చదవడం తప్ప బాలకృష్ణ చేసేదేమీ లేదన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

శనివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. షూటింగ్ ల కోసం దేశ విదేశాలు తిరిగే బాలకృష్ణకు రాష్ట్ర పరిస్థితులు తెలియవన్నారు. పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందన్నారు. 

స్టీల్ ప్లాంట్ పై మోడీని విమర్శించలేకే జగన్ పై బాబు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.చంద్రబాబు ఓ శనిగ్రహం అని ఎన్టీఆర్ ఏనాడో అన్నారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ నేతలు శని వదిలించుకోవడానికే చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.