అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు  వరి చేనుకి, చేపల చెరువుకి  కూడ తేడా తెలియదని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

శుక్రవారంనాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. లోకేష్ ఓ వేస్ట్ ఫెలో అన్నారు. రాష్ట్రంలో లోకేష్ ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదన్నారు. అమరావతిలో ఉన్న రైతులే రైతులు కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు.

also read:ట్రాక్టర్ నడపలేనివాడు పార్టీని ఏం నడుపుతాడు: లోకేష్ పై కొడాలి నాని సెటైర్లు

అమరావతిలో భూములు కొన్నందునే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని మంత్రి విమర్శించారు. రైతులకు బేడీలు వేశారని తనకు తానుగా మాజీ మంత్రి దేవినేని ఉమ బేడీలు వేసుకొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ దేవినేని ఉమ గన్ తో కాల్చుకోవాలన్నారు.

రాజధాని రైతులకు బేడీలు వేసినందుకు గాను  ఎస్కార్ట్ సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.పోలవరం ప్రాజెక్టు ఇబ్బందులకు దేవినేని ఉమనే కారణమని ఆయన చెప్పారు.