విజయవాడ: చంద్రబాబు పై మరోసారి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఆయన స్టేలబాబుగా అభివర్ణించారు. ఈ రాష్ర్టంలో కాని, దేశంలో కానీ అత్యంత పిరికి వ్యక్తి ఎవరు అంటే ఆయనే చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవాచేశారు.

కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకునే చంద్రబాబు కు గడిచిన ఎన్నికలలో ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. కోర్టులలో విచారణ ఎదుర్కోలేని వ్యక్తి నారా చంద్రబాబునాయుడు అని ,కోర్టులో క్యాష్ పిటిషన్ వేసి 4 వారాలు గడువు తీసుకున్న పిరికి వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని విమర్శించారు."

ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికలలో ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు ఇంటికే పరిమితమవుతారని కొడాలి నాని అన్నారు. మళ్లీ చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి కేసును పూర్తిగా కొట్టేయాలని చంద్రబాబు కోరారని ఆయన గుర్తు చేశారు. నాలుగు వారాల పాటు హైకోర్టు స్టే ఇచ్చిందని అన్నారు. మిగిలిన విచారణను కొనసాగించాలని చెప్పిందని ఆయన అన్నారు. 

చంద్రబాబు తనకు ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్ ను, పలుకుబడిని ఉపయోగించి స్టే తెచ్చుకున్నారని ఆయన న్నారు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు నుంచి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకుంటారని ఆయన అన్నారు. తాత్కాలికంగా చంద్రబాబు వాటిని అపుకోగలరు గానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉందని అన్నారు. దాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు అనేక సార్లు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు చంద్రబాబుకు అతి భయంకరమైన శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.