‘కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా చేశారు..’

ap minister kala venkatrao sensational comments on state dividing
Highlights

ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కళా వెంకట్రావు

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి..కనీసం కుర్చోవడానికి కుర్చీ కూడా లేకుండా చేశారని ఏపీ మంత్రి కళా వెంట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మహానాడుకోసం టీడీపీ స్థల పరిశీలన చేసింది. మహానాడు వేదిక కోసం వీఆర్ సిద్ధార్థ గ్రౌండ్‌‌ను మంత్రి కళా వెంకట్రావు పరిశీలించారు. జాతీయ పార్టీలు తలుపులేసి మరీ రాష్ట్రాన్ని అసంబద్ధంగా విడిగొట్టిన పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆశించినంతగా ఢిల్లీ నుంచి సాకారం రాలేదు కాబట్టి.. ఏపీ ప్రజా ప్రయోజనాల కోసం వారితో విభేధించడం జరిగిందన్నారు.
 
తలుపులేసి మరీ విడగొట్టి కూర్చోవడానికి కుర్చీ లేకుండా చేశారని.. ఆ పరిస్థితుల్లో రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే బీజేపీతో.. చంద్రబాబుతో కలవడం జరిగిందన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ నాలుగేళ్లపాటు వేచి చూసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సాయం చేయకపోవడంతో పాటు హేలన చేస్తుండటంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడం జరిగిందని మంత్రి కళా స్పష్టం చేశారు. 

loader