Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ థావోస్ టూర్ పై అసత్యాలు:చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు కూడా దక్కవన్నారు.

AP Minister Jogi Ramesh Serious Comments On TDP Chief Chandrababu
Author
Guntur, First Published May 22, 2022, 4:04 PM IST

అమరావతి: Chandrababu పాపం పండినందునే గత ఎన్నికల్లో TDP  23 స్థానాలకే పడిపోయిందని ఏపీ మంత్రి Jogi Ramesh చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 స్థానాలు కూడా దక్కవన్నారు. 

ఆదివరం నాడు Guntur  జిల్లాలోని Tadepalli లో ఏపీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం థావోస్ పర్యటనపై TDP  నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దోచుకోవడం దాచుకోవడమే చంద్రబాబు నైజమని జోగి రమేష్ విమర్శలు చేశారు. ఏపీ సీఎం జగన్ థావోస్ టూర్ పై   అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.  మాజీ మంత్రి Yanamala Ramakrishnudu   ఏం మాట్లాడుతున్నారని మంత్రి రమేష్ ప్రశ్నించారు.

యనమల రామకృష్ణుడికి వయస్సు పెరిగింది కానీ బుద్ది పెరగలేదన్నారు. సంకుచిత మనస్థత్వంతో విమర్శలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడిపై మంత్రి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబు ఏది మాట్లాడాలిన చెబితే అది మాట్లాడడం యనమల రామకృష్ణుడికి అలవాటైందన్నారు. చంద్రబాబుకు అల్జీమర్స్ రోగమని, యనమల రామకృష్ణుడికేమో కడుపు మంట రోగమని జోగి రమేష్ విమర్శలు చేశారు. 

ప్రజలు ఓటు అనే ఆయుధంతో టీడీపీని కొడతారని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు. ఏపీకి బుల్లెట్ రైలు వచ్చిందని గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రచారం చేసుకుందన్నారు.ఈ విషయమై గతంలో వచ్చిన మీడియా కథనాన్ని జోగి రమేష్ మీడియా సమావేశంలో చూపించారు.ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఇప్పటికే ఆరు అంశాలపై తమ ప్రభుత్వం  ఒప్పందం చేసుకొందన్నారు. 

also read:లండన్‌లో జగన్‌ ల్యాండింగ్‌ ‌: ఇది ప్రీ ప్లాన్డ్ టూర్.. బుగ్గనవి అబద్ధాలే, అయ్యన్నపాత్రుడు కౌంటర్

చంద్రబాబు పాపం పండింది కాబట్టే ప్రజలు  గత ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టారని జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు ఎన్ని చిందులు తొక్కినా కూడా ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారన్నారు. కాకినాడలో YCP  ఎమ్మెల్సీపై ఆరోపణలు రావడంతో 302 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదైనట్టుగా ఆయన గుర్తుచేశారు.చట్టానికి అందరూ కూడా సమానమని జగన్ ఆచరణ ద్వారా చూపారన్నారు. తన బంధువుపై ఆరోపణలు రావడంతో కడప జిల్లా నుండి బహిష్కరణ చేయించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

మనసున్న ముఖ్యమంత్రి పాలనలో తాము గడప గడపకు వెళ్తున్న సమయంలో ప్రజలు తమను ఆశీర్వదిస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా కూడా ప్రజలు చంద్రబాబుకు గట్టి బుద్ది చెబుతారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios