’’పవన్ వల్ల జగన్ మైలేజ్ డ్యామేజయ్యింది‘‘

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 11, Aug 2018, 2:38 PM IST
ap minister chinarajappa and ayyannapatrudu fire on jagan
Highlights

తల్లి, చెల్లి, భార్యను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసింది జగన్‌ కాదా? అని నిలదీశారు. వైఎస్‌ విజయలక్ష్మి విశాఖలో ఓడిపోవడానికి జగనే కారణమని చెప్పారు.
 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల జగన్ మైలేజ్ కి డ్యామేజ్ జరిగిందని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్ లేఖల ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 జగన్‌పై అవినీతి కేసులు ఉన్నాయన్నది వాస్తవం అన్నారు. ఈడీ కేసులో భారతి పేరును చేర్చితే.. చంద్రబాబు బీజేపీతో కుమ్మక్కై చేయించారనడం అర్ధరహితమని చినరాజప్ప వ్యాఖ్యానించారు.

ఇదేవిషయంపై మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ పై మండిపడ్డారు. కుటుంబంలోని ఆడవాళ్లను రోడ్డుకు లాగిన జగన్.. ఇప్పుడు చంద్రబాబే అందుకు కారణమని ఆరోపించడం తగదన్నారు. తల్లి, చెల్లి, భార్యను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసింది జగన్‌ కాదా? అని నిలదీశారు. వైఎస్‌ విజయలక్ష్మి విశాఖలో ఓడిపోవడానికి జగనే కారణమని చెప్పారు.

 జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన షర్మిల.. ఇప్పుడు కనిపించకపోవడానికి అందుకు కారణం కూడా జగనే అని వ్యాఖ్యానించారు. అలాగే భారతిపై ఈడీ కేసుల నమోదుకు జగనే కారణమని అయ్యన్నపాత్రుడు తెలపారు.
 

loader