Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం: టీడీపీ సభ్యుల ఆందోళనలపై బుగ్గన ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనలపై  ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Minister  Buggana Rajendranath reddy  Responds on  TDP Legislators lns
Author
First Published Sep 21, 2023, 9:39 AM IST

అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనలపై  ఏపీ మంత్రి బుగ్గన రామచంద్రారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ స్కిల్ స్కాంపై  చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని   మంత్రి బుగ్గన రామచంద్రారెడ్డి  చెప్పారు.

గురువారంనాడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలు ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్ పై   టీడీపీ సభ్యులు  నిరసనకు దిగారు.ఈ నిరసనలపై ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం  చేశారు. ప్రతిసారి అర్థంపర్థం లేని వాయిదా తీర్మానం  ఇచ్చి  సభను అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మరో పద్దతిలో  రావాలని టీడీపీ సభ్యులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథన్ రెడ్డి  సూచించారు.  ఏపీ స్కిల్ స్కాం డెవలప్ మెంట్ సహా ఇతర అంశాలపై  ప్రభుత్వం వేసే ప్రశ్నలకు  టీడీపీ వద్ద  సమాధానం ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్కిల్ స్కాం డెవలప్ మెంట్ పై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.చంద్రబాబు అరెస్ట్ పై చర్చపై బీఏసీలో నిర్ణయం తీసుకుందామని మంత్రి  రాజేంద్రనాథ్ రెడ్డి  చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios