Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల: ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్, కడప లాస్ట్


ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు విడదలు చేశారు. 

AP Minister Botsa Satyanarayana Release Intermediate  Results
Author
Guntur, First Published Jun 22, 2022, 12:43 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర Education మంత్రి Botsa Satyanarayana బుధవారం నాడు అమరావతిలో Intermediate Results ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు జరిగిన  28 రోజుల్లోనే  ఇంటర్ పరీక్ష ఫలితాలను AP Gvonernment  విడుదల చేసింది.  ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4 లక్షల 45 వేల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అయితే ఫస్టియర్ లో 2,41, 591 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ లో 54 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించినట్టుగా మంత్రి తెలిపారు.

ఇంటర్మీడియట్ సెకండియర్ లో 2,58,449 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సెకండియర్ లో 61 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను 8 లక్షల 69 వేల 59 మంది విద్యార్ధులు హాజరయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

కృష్ణా జిల్లాలో అత్యధికంగా 72 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.  రాష్ట్రంలోని  అన్ని జిల్లాల్లో కంటే కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 50 శాతం ఉత్తీర్నతతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందని మంత్రి వివరించారు.ఇంటర్ ఫలితాల్లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించినట్టుగా మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఆగష్టు 3 నుండి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇంటర్ ఫస్టియర్ లో 49 శాతం మంది బాలురు, 60 శాతం బాలికలు, ఇంటర్ సెకండియర్ లో 56 శాతం బాలురు, 68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు.  ఇంటర్ ఒకేషనల్‌ ఫస్టియర్లో 40శాతం, సెకండ్ ఇయర్ 55శాతం మంది పాస్ అయ్యారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయన తెలిపారు.ఫస్ట్ ఇయర్ లో   49 శాతం బాలురు,,బాలికలు 65 శాతం  బాలికలు పాసయ్యారు. సెకండ్ ఇయర్ 59 బాలురు,, 68 శాతం  బాలికలు పాసయ్యారని మంత్రి వివరించారు..

ఈ నెల  25 నుంచి జులై 5 వరకు బెటర్ మెంట్  పరీక్షలతో పాటు  సప్లిమెంటరీకి పరీక్ష ఫీజు కట్డుకోవచ్చని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 679 మండలాల్లో .474 జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. ప్రతీ మండలానికి రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారన్నారు. ఇందులో ఒక కాలేజ్ కో ఎడ్యుకేషన్ కాలేజీ అయితే, మరోటి బాలికల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. 

ప్రస్తుతం ఉన్న కళాశాలలు కాకుండా 884 ఇంకా కొత్త కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 884 హైస్కూళ్లని ఇంటర్ కళాశాలలగా అప్ గ్రేడ్ చేయబోతున్నామన్నారు. అవసరమైన సిబ్బందిని, లెక్చరర్స్ ని నియమిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.ఇంటర్ ఫలితాలలో కూడా ర్యాంకులు ప్రకటించకూడదని ఆదేశించామన్నారు. ర్యాంకులు ప్రకటించే కార్పోరేట్, ప్రైవేట్ విద్యా సంస్ధలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో ఈ ఏడాది  మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇటీవలనే ఏపీ ప్రభుత్వం టెన్త్ క్లాస్ పరీక్ష పలితాలను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాలను https:// bie.ap.gov.in, https://examresults.ap.nic.in ద్వారా తెలుసుకోవచ్చు

Follow Us:
Download App:
  • android
  • ios