జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  మండిపడ్డారు. జగనన్న ఇళ్ల నిర్మాణంపై పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

అమరావతి:నీ మీద ప్రధానికి ఫిర్యాదు చేయడానికి నీవేమైనా పుడింగివా అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు.సోమవారంనాడు అమరావతిలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సినిమా నటుడు వచ్చాడని చూసేందుకు వచ్చిన జనాల ముందు ఆవేశంగా మాట్లాడితే సరిపోతుందా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.తేల్చేస్తా, తేల్చేస్తా అంటున్నావు కదా...ఏం తేల్చేస్తావని ఆయన పవన్ ను ప్రశ్నించారు. నువ్వు చెప్పేదంతా ప్రజలు నమ్మడానికి నీవేమైనా యుగపురుషుడివా అని మంత్రి అన్నారు.

also read:వైసీపీ సర్కార్ ను కిందకు ఈడ్చుతాం:విజయనగరంలో పవన్ కళ్యాణ్

పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.ఆరోపణలతో ప్రజల్నిమభ్యపెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు.గత ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని ఇండ్లు కట్టించారో ఎప్పుడైనా ప్రశ్నించావా అని ఆయన పవన్ ను అడిగారు. ప్రతిపేదవాడికి పక్కా ఇళ్లు ఉండాలని వైఎస్ఆర్ ప్రయత్నించారన్నారు. తండ్రి బాటలోనే జగన్ సాగుతున్నాడని మంత్రి బొత్ససత్యనారాయణ చెప్పారు. పేదలకు శాశ్వత ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామన్నారు.జగనన్న కాలనీలకు రూ.3వేలు ఖర్చుపెడితే రూ.15వేల కోట్ల అవినీతిఎలా జరుగుతుందో అర్ధం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడారన్నారు. జనసేన రాజకీయపార్టీ కాదన్నారు. జనసేనను తాను పార్టీగా కూడా చూడడం లేదన్నారు.