Asianet News TeluguAsianet News Telugu

ఆ కారణంతోనే ఉపాధ్యాయుల వేతనాలు ఆలస్యం.. మంత్రి బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు వేతనాలు ఆలస్యం కావడంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఏపీలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు  విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ap minister botsa satyanarayana about delay in salaries to govt teachers ksm
Author
First Published Sep 5, 2023, 3:42 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులకు వేతనాలు ఆలస్యం కావడంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు  విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో ఉపాధాయులకు వేతనాలు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ఈ నెల 7 లేదా 8 తేదీల్లో ఉపాధ్యాయుల ఖాతాల్లో వేతనాలను  జమ చేస్తామని తెలిపారు. 

గతంలో విద్యా సంస్థ గురించి వస్తే.. కేరళ, ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుకునేవారని అన్నారు. ఈరోజు దేశం మొత్తం ఏపీ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటుందని అన్నారు.  సీఎం జగన్ విద్య కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాలను ప్రశంసించారని చెప్పారు. 

రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా  యూనివర్సిటీల్లో నియామకాలు లేవని అన్నారు. గత  ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేయలేదని విమర్శించారు. విశ్వవిద్యాలయాల్లో అన్ని పోస్టులను డిసెంబర్ నాటికి భర్తీ చేస్తామని  చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో..ప్రైవేట్ పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థులకు ఉత్తమ  ఫలితాలను సాధించారని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios