‘బస్సు యాత్రకే అలిసిపోయాడు..రాష్ట్రాన్ని నడిపిస్తాడా..?’

First Published 26, May 2018, 10:42 AM IST
ap minister ayyannapatrudu comments on jagan and pawan
Highlights

బిజేపీ ఇచ్చిన స్క్రిప్టు చదివితే సరిపోదు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, పవన్ లపై కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని
విరుచుకుపడ్డారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ... 16 నెలలు జైలులో ఉన్న జగన్‌... 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోటీ ఎలా అవుతారు? అని అయ్యన్న
ప్రశ్నించారు.  పెన్షన్‌ అంటే అర్థం కూడా జగన్ కి తెలీదని.. అసలు  ఏ వయసు నుంచి పెన్షన్‌ ఇస్తారనే కనీస అవగాహన కూడా జగన్‌కు లేదని విమర్శించారు.

రాష్ట్రం అప్పుల్లో ఉండి కూడా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందన్నారు. జూన్‌ నుంచి మరో 3 లక్షల 50 వేల కొత్త పెన్షన్‌లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఇవేమీ తెలియని పవన్‌ కల్యాణ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నాలుగు రోజులు బస్సుయాత్ర చేస్తే అలిసిపోయి విశ్రాంతి తీసుకునే ఆయన రాష్ట్రాన్ని నడిపించగలరా? అంటూ పవన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొరపాటున కరెంటు పోతే తనను చంపటానికి ప్రయత్నిస్తున్నారని  ఆరోపిస్తుంటే ఆయన రాజకీయ పరిపక్వత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.  వీరందరూ బీజేపీ ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని విమర్శించారు.
 

loader