అమరావతి: కృష్ణా వరదలపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వరదల్లో కూడా చంద్రబాబు హైటెక్ వ్యవహారాన్ని చంద్రబాబు వదిలిపెట్టలేదని సెటైర్లు వేశారు. 

మైకెల్ జాక్సన్ మైకుతో పవర్ పోయినా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రెస్మీట్ లో ఒక్క నిజమైనా చెప్తారని ఆశించామని కానీ అలా జరగలేదంటూ సెటైర్లు వేశారు. 

వరద వల్ల ఇబ్బంది పడిన ప్రజల గురించి అయినా చంద్రబాబు మాట్లాడతారని భావించామని కానీ రిజర్వాయర్ లో కట్టుకున్న తన ఇల్లు ఎలా మునిగిపోయిందో చూపించారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఎలా వచ్చింది...రాజధానిలోకి నీరు ఎలా చేరింది అంటూ చెప్పి ఇది ప్రకృతి విపత్తు కాదు మానవ విపత్తు అంటూ ఏవేవో చెప్పేశారంటూ సెటైర్లు వేశారు. 

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏనాడైనా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ నిండిందా అని ప్రశ్నించారు. కానీ దేవుడి ఆశీస్సులతో రెండు నెలల్లోనే అన్ని ప్రాజెక్టులు తమ హయాంలో నిండాయని చెప్పుకొచ్చారు. 

రాయలసీమకు శ్రీశైలం నుంచి నీరు ఇవ్వడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంటూ విమర్శించారు. ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని చంద్రబాబు బాధపడిపోతున్నారంటూ విమర్శించారు.  

సీఎం జగన్ ను వరదలు మ్యాన్‌ మేడ్‌ అంటున్న చంద్రబాబు, అయితే కరవు మేడ్ మేన్ చంద్రబాబు నాయుడా అంటూ నిలదీశారు. వరదలు తాము సృష్టించామని చెప్తే కరవును చంద్రబాబు సృష్టించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
కృష్ణా డెల్టా రైతులకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరందుతున్న ఆనందం గానీ, తాగునీటికి సమస్యలేదన్న ఆనందంగానీ చంద్రబాబులో ఏమాత్రం కనబడటం లేదన్నారు. చంద్రబాబుది నీచ రాజకీయం అంటూ తిట్టిపోశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.  

ఈ వార్తలు కూడా చదవండి

వరదను నియంత్రించే ఛాన్స్ ఉంది కానీ....: కృష్ణా వరదలపై చంద్రబాబు ఆరోపణలు