అమరావతి: 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు.  అయ్యప్ప మాల వేసుకొన్నా.. తాను చెప్పిన విషయాల్లో ఎలాంటి అబద్దాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో పోలవరంపై చర్చను ఏపీ మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు.తనను అనుభవం లేని మంత్రి అని కొందరు విపక్ష సభ్యులు విమర్శించారు. తనను విమర్శించిన వారు అసెంబ్లీలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. 

also read:ప్యాకేజీ కోసమే 2014 రేట్లకే పోలవరం నిర్మాణానికి ఒప్పుకొన్నారు: బాబుపై మంత్రి అనిల్ ఫైర్

గత ప్రభుత్వ హయంలోని ఇరిగేషన్ మంత్రి కంటే ఎక్కువే నేర్చుకొన్నానని  ఆయన చెప్పారు. దేవుడు తనకు అనేక కష్టాలు ఇచ్చాడన్నారు. తన సోదరుడు, తన తండ్రిని తాను కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.  అన్నింటిని ఎదుర్కొంటూనే తాను ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు.

తనకు దైవ సమానుడైన అండ జగన్ ఉన్నాడని.. ఈ ధైర్యం తనకు చాలునని ఆయన చెప్పారు.చంద్రబాబు ప్రభుత్వ హయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే నీళ్లిస్తామని ప్రచారం చేసుకొన్నారని ఆయన విమర్శించారు.

తాను అయ్యప్ప మాల వేసుకొన్నాను.. తప్పులు మాత్రం చెప్పడం లేదని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. చంద్రబాబు సర్కార్ హయంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్పారు. కానీ తమ ప్రభుత్వ హయంలో సీఎంతో పాటు మంత్రులు , ఎమ్మెల్యేలు పర్యటించిన సమయంలో సింగిల్ పైసా కూడా ఖర్చు చేయలేదని ఆయన గుర్తు చేశారు.