అమరావతి: చంద్రబాబు నివాసం కూడ అక్రమ కట్టడమేనని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి  అనిల్ కుమార్  చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్న చంద్రబాబు గౌరవంగా ఖాళీ చేయాలని మంత్రి అనిల్ కుమార్ సూచించారు. ఐదేళ్లు తుగ్లక్ పాలన కాబట్టే టీడీపీ ప్రతిపక్షంలో  కూర్చుందన్నారు. రేపటి నుండి  అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

పోలవరంలో కూడ అక్రమాలను బయటపెడతామని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. ప్రజా వేదిక అక్రమ కట్టడమన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఈ భవనాన్ని నిర్మించారని  మంత్రి ఆరోపించారు. చంద్రబాబు నివాసం కూడ అక్రమ కట్టడమేనని చెప్పారు.

చంద్రబాబు ఇల్లు కూడ అక్రమ కట్టడమే అది కూల్చాలో ఉంచాలో తేల్చుకోవాలని ఆయన సూచించారు.అక్రమ కట్టడాల్లో ఉండకూడదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

కలెక్టర్ల సమావేశంలో  ప్రజా వేదిక అక్రమ నిర్మాణమని జగన్ ప్రకటించారు. అంతేకాదు  ఈ సమావేశం నుండే  ప్రజా వేదికను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు  చంద్రబాబు కూడ అక్రమంగా నిర్మించిన  భవనంలోనే నివాసం ఉంటున్నారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

సంబంధిత వార్తలు

చంద్రబాబు నివాసం కూల్చివేతకూ రంగం సిద్దం?

చంద్రబాబు నివాసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ప్రత్యేక హోదా ఉద్యమం: కేసుల ఎత్తివేతకు జగన్ ఆదేశం

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీఎం జగన్ సీరియస్: ఎవరినీ వదలొద్దు

త్వరలోనే పోలీసు శాఖలోఖాళీలు భర్తీ: సుచరిత