పోలవరం ఆలస్యానికి చంద్రబాబు నిర్ణయాలే కారణం: ఏపీ మంత్రి అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడానికి చంద్రబాబునాయుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఏపీ రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
అమరావతి: Polavaraim Project పనులు ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఏపీ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.సోమవారం నాడు ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి Ambati Rambabu మీడియాతో మాట్లాడారు. పనుల నాణ్యత పెంచేందుకు కాంట్రాక్టర్ ను మారిస్తే తప్పా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలవరం డ్యామ్ పై మంత్రి అంబటి రాంబాబు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవవరంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.
ట్రాన్స్ ట్రాయ్ ను పక్కకకు తప్పించి Navayuga కంపెనీకి పోలవరం పనులు అప్పగించింది Chandrababunaidu కాదా అని మంత్రి అంబటి రాంబాబు అడిగారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు అతి తెలివి వల్ల కాఫర్ డ్యాం దెబ్బతిందన్నారు. Coffer Dam పూర్తి చేయకుండానే డయాఫ్రం వాల్ కట్టారని అంబటి రాంబాబు చంద్రబాబుపై మండిపడ్డారు. కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారన్నారు. చంద్రబాబునాయుడు సర్కార్ హయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తమపై దుష్ట్ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.పనుల నాణ్యతను పెంచేందుకే తాము కాంట్రాక్టర్ ను మార్చామని అంబటి రాంబాబు చెప్పారు కాంట్రాక్టర్ ను మార్చడం ద్వారా 12.6 శాతం ఖర్చును తగ్గించామని అంబటి రాంబాబు వివరించారు. కానీ చంద్రబాబు మాత్రం నామినేషన్ ద్వారా కాంట్రాక్టర్లను మార్చాడని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు తప్పులు చేయడంతో ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వైఎస్ఆర్ ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం చిత్తశుద్దితో తాము పనిచేస్తున్నామని అంబటి రాంబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ. 1500 కోట్లు ఖర్చు చేసన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెక్రటరీలు, మంత్రులును మారిస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
also rad:రివర్స్ టెండరింగ్ డ్రామా వల్లే పోలవరం నిర్మాణం సంకనాకింది.. దేవినేని ఉమ
పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాలను టీడీపీ నేత, మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. తమ ప్రభుత్వ హయంలో భారీ వరద వచ్చినా తట్టుకొనే రీతిలో స్పిల్ వే నిర్మాణం చేపట్టినా వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా అది దెబ్బతిందన్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఆయన మండిపడ్డారు. కాఫర్ డ్యామ్ నిర్మించకుండా డయా ఫ్రం వాల్ నిర్మించడాన్ని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తప్పుబట్టారు. రివర్స్ టెండరింగ్ పై ప్రాజెక్టు నాణ్యత దెబ్బతిందని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.ఈ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. రివర్స్ టెండరింగ్ ద్వారా 12 శాతానికి పైగా నిధులను ఆదా చేశామన్నారు. ప్రజల సొమ్మును ఆదా చేయడం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ నేతలతో పాటు ఓ వర్గం మీడియా తమపై పోలవరం ప్రాజెక్టు విషయమై తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.