అచ్యుతాపురం సెజ్ లో విషవాయువుల లీకేజీ: మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని అచ్యుతాపురం ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీ డెక్ లలో క్రిమి సంహరక మందులు ఉపయోగించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా ఇతరత్రా కారణాలా అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని Atchutapuram ఘటన విషయమై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి Amarnath కీలక వ్యాఖ్యలు చేశారు.
బుధవారం నాడు ఆయన విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏసీ డెక్ లలో క్రిమిసంహరక మందులు కలపడం వల్లే తొలిసారి ప్రమాదం జరిగిందన్నారు. గ్లోరిఫై పాలీస్ అనే రసాయనం వెలువడినట్టుగాతెలిసిందని మంత్రి చెప్పారు.ఇప్పుడు ఏసీ డెక్ వల్ల జరిగిందా లేదా క్రిమి సంహారక మందుల వల్ల జరిగిందా అనేది గుర్తించాలల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రమాదం
యాధృచ్చికమా, ఉద్దేశపూర్వకమా అనేది తేలాల్సి ఉందన్నారు.పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్ ముఖ్యమన్నారు.
లేని పక్షంలో ఆయా కంపెనీలపై చర్యలు తీసుకొంటామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.అచ్యుతాపురం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేస్తామని మంత్రి తెలిపారు.
అచ్యుతాపురం SEZ లో మంగళవారం నాడు రాత్రి విషవాయువులు లీకయ్యాయి. దీంతో ఈ సెజ్ లో పనిచేస్తున్న మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన మహిళలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు సుమారు 50 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు తెలిపారు. బ్రాండ్రిక్స్ ప్రాంగణంలో గ్యాస్ లీకైందని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇదే సెజ్ లో విష వాయువులు లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.ఈ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 4 వేల మంది పనిచేస్తున్నారు.
ఈ ఏడాది మే మాసంలో కూడా ఇదే సెజ్ లో విష వాయువులు లీకయ్యాయి.ఈ సమయంలో కూడా ఇక్కడ పనిచేసే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. విష వాయువులు లీకైన ఘటనకు సంబంధించి కొన్ని రోజులు విషవాయువులు లీకేజీకి సంబంధించి విచారణ చేశారు. కొన్ని రోజుల పాటు పరిశ్రమను కూడా తాత్కాలికంగా మూసివేశారు. అయితే మళ్లీ అదే రకంగా విషవాయువులు లీక్ కావడంతో అధికారులు విచారణ చేస్తున్నారు.