‘అత్యాచారాలు చేయండి అంటూ.. మోదీ రెచ్చగొడుతున్నారు’

ap minister akhila priya sensational comments on pm modi
Highlights

అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ మంత్రి అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆమె మోదీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మహిళలు బయటకు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితులు బీజేపీ క్రియేట్ చేసిందని ఆమె మండిపడ్డారు.  ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు మహిళల సంరక్షణ కోసం అన్ని చర్యలు చేపడుతుంటే .. ప్రధాని మోదీ మాత్రం మహిళలపై దాడులు చేయండి అని ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు. అత్యాచారాలు చేయాల్సిందిగా మోదీనే రెచ్చగొడుతున్నారని ఆమె పేర్కొన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

కాగా.. మోదీ పై అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నట్లు సమాచారం. 

loader