ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ.. పెళ్లికూతురయ్యారు. అఖిలప్రియ వివాహం ఈ నెల 29న ఉదయం 10:57 గంటలకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పెళ్లికి రెండు రోజులు ముందుగానే.. ఆమెకు మంగళ స్నానాలు చేయించి నవ వధువుగా  అలంకరించారు. ఆమె పెళ్లికూతురుగా ముస్తాబైన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

ఇప్పటికే.. వివాహ శుభ ప్రతికను ప్రముఖులందరికీ అందజేశారు. ఈ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల ఫోటోలు  ముద్రించారు.  ఈ ఫోటోలతో ఆహ్వనపత్రికలో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ వివాహానికి భూమా అభిమానులు కూడ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో  ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు.

read more news..

భూమా అఖిలప్రియ పెళ్లి: లారీ లోడ్ పెళ్లికార్డుల పంపిణీ, గోవా నుండి ఈవెంట్ టీమ్

భూమా దంపతుల ఫోటోలతో అఖిలప్రియ పెళ్లి పత్రిక