ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు: నామినేషన్లకు నేడే చివరి రోజు, సమాచార సేకరణలో ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ చివరి దశలో ఉంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు. దీంతో ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రతి రెండు గంటలకు ఏపీ ఎస్ఈసీ సమాచారం తెప్పించుకొంటుంది.
అమరావతి: గతంలో ఎన్నికలు నిర్వహించని AP Local Body Elections స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం నాడే చివరి రోజు. దీంతో ఇవాళ Nominations అధికంగా దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రతి రెండు గంటలకు ఓసారి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాచారం తెప్పించుకొంటుంది.
also read:Chandarababu Naidu: ఇతర మతాల పండుగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ పెట్టేవారా?.. చంద్రబాబు ఫైర్..
రాష్ట్రంలో పోటీలో ఉన్న అభ్యర్ధులు మరణించడం లేదా పలు కారణాలతో ఎన్నికలు నిర్వహించని సంస్థలకు AP Local Body Elections నిర్వహించేందుకు AP SEC నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 498 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ,533 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల్లో కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కుప్పంతో పాటు మరో ఏడు గ్రామ పంచాయితీలను విలీనం చేసి ముస్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ గా మారిన తర్వాత తొలిసారిగా కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా Tdp దూరంగా ఉంది. అయితే కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. కుప్పం నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. దీంతో కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికను టీడీపీ, Ycpసీరియస్ గా తీసుకొన్నాయి.
ఇటీవలనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు రెండు రోజులు పర్యటించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు. గతంలో ఫిర్యాదు చేసిన నేతలను ఈ టూర్ లో చంద్రబాబునాయుడు దూరంగా ఉంచారు. ఈ టూర్ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందో లేదో అనేది ఎన్నికల పలితాలు తేల్చనున్నాయి. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని ఏ స్థానం నుండి చంద్రబాబు పోటీ చేసినా కూడ చంద్రబాబును ఓడిస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. అయితే కుప్పం టూర్ లో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని చంద్రబాబు ప్రకటించి కార్యకర్తల్లో జోష్ నింపారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ల దాఖలుకు అవకాశం ఉంది. దీంతో ప్రతి రెండు గంటలకు ఓసారి రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల నుండి సమాచారం తెప్పించుకొంటుంది.మరోవైపు కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఈ నెల 6న దాఖలైన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అదే రోజున తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
ఈ ఎన్నికలకు నవంబర్ 3న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లలో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి ఈ నెల 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి నవంబర్ 18న ఫలితాలు వెల్లడిస్తారు.