తాతను కుర్చీలో మోసుకొచ్చి ఓటు వేయించిన మనవలు (వీడియో)

ఆంధ్రప్రదేశ్ లో శనివారం ప్రారంభమైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

ap local body electiona second phase, old age people voting in vijayanagaram - bsb

ఆంధ్రప్రదేశ్ లో శనివారం ప్రారంభమైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

"

విజయనగరం జిల్లాలో రామభద్రపురం మేజర్ పంచాయతీలోని పోలింగ్ కేంద్రంలో కదలలేని వయోవృద్ధులను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి మరీ ఓటువేయిస్తున్నారు. 

నడవలేని స్థితిలో ఉన్న తమ తాతను కుర్చీలో కూర్చోబెట్టి పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు ఇద్దరు మనవలు. 

రెండో దశలో 13 జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్లలోని 167 మండలాల్లో 3,328 సర్పంచ్‌ స్థానాలకు, 33,570 వార్డు సభ్యులకు గాను నోటిఫికేషన్‌ జారీచేయగా... 539 సర్పంచ్‌లు, 12604 వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు అయిన విషయం తెలిసిందే. 

ఏపీలో ప్రారంభమైన 2వ దశ పంచాయతీ ఎన్నికలు: జోరుగా పోలింగ్...

నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో సర్పంచ్‌ స్థానం చొప్పున మొత్తం మూడు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అంతేకాకుండా  149 చోట్ల వార్డు సభ్యులకు ఒక్క నామినేషన్‌ కూడా అందకపోవడం గమనార్హం. దీంతో ఏకగ్రీవాలు పోను 2,786 సర్పంచ్‌లకు, 20,817 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios