ఏపీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలు: సభ్యులు వీరే

ఏపీ శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్  రెండు సెలెక్ట్ కమిటీలను ప్రకటించారు. 

Ap legislative council chairman Shariff appointed select committees for two bills

అమరావతి: ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీలను ఛైర్మెన్  షరీఫ్ ప్రకటించారు.  పాలనా వికేంద్రీకరణ బల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్టుగా  గతంలోనే  షరీఫ్ ప్రకటించారు.

సెలెక్ట్ కమిటీకి సభ్యుల పేర్లన పంపాలని షరీఫ్ లేఖ రాశారు. ఈ విషయమై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్దం సాగింది. శాసనమండలి ఛైర్మెన్  కు టీడీపీ బీజేపీ, పీడీఎఫ్‌లు పేర్లను ప్రకటించాయి.  సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్దమని వైసీపీ అభిప్రాయపడింది.ఈ మేరకు శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్‌కు వైసీపీ లేఖ రాసింది.  

Also read:ఏపీ శాసనమండలి సెలెక్ట్ కమిటీ: పేర్లిచ్చిన టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్

 సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా బొత్స సత్యనారాయణను మండలి చైర్మన్ నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు ఉండగా,  పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీకి చెందిన సోము వీర్రాజు సభ్యులుగా ఉంటారు. 

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా టీడీపీ నుంచి లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి ఉండగా.. పీడీఎఫ్‌కి చెందిన లక్ష్మణరావు, బీజేపీకి చెందిన మాధవ్‌, వేణుగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు.

ఈ కమిటీల్లో తామూ భాగస్వాములము కాబోమని వైసీపీ  తేల్చి చెప్పింది. మండలి చైర్మన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్‌, ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు లేఖ రాశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios