పీఆర్సీపై పీటముడి: ఉద్యమానికి సిద్దమౌతున్న ఉద్యోగ సంఘాలు


పీఆర్‌సీ పై ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సిద్దమౌతున్నాయి.పీఆర్సీపై ప్రభుత్వం నుండి స్పందన లేదని ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీలు వేర్వేరుగా సమావేశమై పీఆర్సీపై చర్చించనున్నారు.

AP Jac, AP Amaravati Jac Employees Union meeting to finalize future course of action on prc

అమరావతి: Prc పై ఏపీ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో  AP Jac, AP Amaravath Jac కి చెందిన employees Unionనేతలు సోమవారం నాడు సమావేశమయ్యారు.తొలుత ఈ రెండు సంఘాలు వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఈ రెండు  సంఘాల నేతలు  సంయుక్తంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను సిద్దం చేయనున్నాయి.

also read:పీఆర్సీపై పీటముడి: అధికారుల తీరుపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి, జనవరి 3న భవిష్యత్తు కార్యాచరణ

పీఆర్సీ ఫిట్‌మెంట్ పై ఏపీ ప్రభుత్వం ఇంకా తేల్చలేదు.ఈ విషయమై ఉద్యోగ సంఘాలతో  గత మాసం చివరిలో జాయిట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలతో Chief secretary నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ చర్చించింది. అయితే ఈ సమావేశంలో కూడా పీఆర్సీ ఫిట్‌మెంట్ విషయంలో 14.29 కంటే ఎక్కువ ఇవ్వలేమని కార్యదర్శుల కమిటీ సమావేశంలో అధికారులు ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పారు.   దీంతో  ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పీఆర్సీ విషయంలో గతంలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇచ్చిన హామీల మేరకు తమ నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకొన్నామని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.

27 శాతంపైన పీఆర్సీ ఫిట్ మెంట్  ఇచ్చేలా  ఉంటేనే చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. పీఆర్సీపై కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికను సీఎంకు ఇచ్చిన 72 గంటల్లోనే ఫిట్‌మెంట్ పై సీఎం తేలుస్తారని సీఎస్ Sameer Sharma  చేసిన ప్రకటనను ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.

దాదాపుగా 15 రోజులు దాటినా కూడా పీఆర్సీపై ప్రభుత్వం నాన్చివేత ధోరణిని అవలంభిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 75 శాతం ఆదాయం  ఉద్యోగుల జీత భత్యాలకే ఖర్చు పెడుతున్నామనే వాదనలో వాస్తవం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios