Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల: ఒకేసారి ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్, దేశంలోనే ప్రథమం

ఆంధ్రప్రదేశ్‌‌లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. రాష్ట్రంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఒకేసారి ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు.

ap intermediate 1st yea and 2nd year results released
Author
Amaravathi, First Published Jun 12, 2020, 4:26 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌లో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డు. రాష్ట్రంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఒకేసారి ఫస్ట్ , సెకండ్ ఇయర్ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా కాలేజీలు ర్యాంకులు ప్రచారం చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. జూన్ 15 నుంచి విద్యార్ధులకు మార్కుల మెమోలు అందిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌లోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. 

కరోనా వైరస్ వంటి క్లిష్టపరిస్ధితుల్లోనూ ఇంటర్ ఫలితాలు దేశంలోనే అందరికంటే ముందుగానే విడుదల చేస్తున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేశ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గదర్శకంలో విద్యాశాఖ అధికారులు సమిష్టిగా కృషి చేసి ఫలితాల విడుదలకు కృషి చేశారని మంత్రి ప్రశంసించారు.

విద్యార్ధులు ఫలితాలు చూసుకునేందుకు హాల్ టికెట్, పుట్టినతేదీ తప్పనిసరని సురేశ్ వెల్లడించారు. సుమారు పది లక్షల 64 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని.. వీరిలో 4 లక్షల 88 వేలమంది ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారని మంత్రి తెలిపారు.

ఇంటర్ ఫస్టియర్‌‌లో 59 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా సెకండియర్‌‌లో 63 శాతంగా నమోదైందని ... విద్యార్ధులు 17 వెబ్‌సైట్‌లలో తమ ఫలితాలను చూసుకోవచ్చని ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 

ఇంటర్ ఫస్టియర్‌లో 75 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానం నిలిచింది. 65 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇంటర్ సెకండియర్‌లో కృష్ణా జిల్లా 75 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. 71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 

ఇంటర్‌మొదటి సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్ధినీ, విద్యార్ధులు - 5,07,230  

పాసైన విద్యార్ధులు - 3.00,560 మంది 

ఉత్తీర్ణత శాతం- 59 

పస్ట్ ఇయర్ బాలికల్లో పరిక్ష వ్రాసిన విద్యార్ధినులు - 2,57,169 

పాసైన వారు -1,64,365 

ఉత్తీర్ణత శాతం- 54% 

రెండవ సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్దినీ, విద్యార్దులు- 4,35,655

పాసైన వారు- 2,76,389

ఉత్తీర్ణతా శాతం- 63

రెండవ సంవత్సరం పరీక్ష రాసిన బాలికలు - 2,22,798 

పాసైన వారు- 1,49,010 

బాలికల్లో ఉత్తీర్ణతా శాతం - 67 

సెకండియర్ బాలురు పరీక్ష వ్రాసిన వారు - 2,12,857

పాసైనవారు -1,27,379 

బాలుర ఉత్తీర్ణత శాతం- 60 

Follow Us:
Download App:
  • android
  • ios