రేపు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి.  మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు.

రేపు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 15న ఇంటర్ ఫస్ట్ ఇయర్, 16వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమై.. మార్చి 4వ తేదీ ముగిసిన సంగతి తెలిసిందే. ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్ధులు హాజరవ్వగా.. ఫస్ట్ ఇయర్‌కు 4,84,197 మంది.. సెకండియర్‌కు 5,19,793 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఏపీవ్యాప్తంగా 1,489 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.