ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా ఈ ఏడాది అడ్మిషన్ సహా వివిధ రకాల ఫీజులు రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. రీ అడ్మిషన్లు, మీడియం లేదా గ్రూప్ మార్పులకు సంబంధించి వసూలు చేసే ఫీజును రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులకు సంబంధించి ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్‌లకు బోర్డు ఆదేశాలు  జారీ చేసింది.