Asianet News TeluguAsianet News Telugu

ఆ వీడియోను ల్యాబ్‌కు పంపాం.. మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్‌పై చర్యలు : తానేటి వనిత

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఎంపీ గోరంట్ల వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని ఆమె తెలిపారు. వీడియో మార్ఫింగ్ కాదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనిత స్పష్టం చేశారు.

ap home minister taneti vanitha reacts on ysrcp mp gorantla madhav video call
Author
First Published Aug 9, 2022, 5:48 PM IST

మరోవైపు.. గోరంట్ల మాధవ్‌ (gorantla madhav) వీడియో వ్యవహారంలో కీలక పరిణామాలు చేసుకుంటున్నాయి. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం.. ఆ వీడియో నిజమని తేలిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇక, గోరంట్ల న్యూడ్ వీడియో, మహిళలకు కరువవుతున్న రక్షణ, పోలీస్, రాజకీయ నిర్బంధాలు, వేధింపులపై చర్చించడానికి నేడు ఏపీ మహిళ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.

Also REad:కమ్మ VS కురుబగా మారిన గోరంట్ల మాధవ్ వ్యవహారం.. సై అంటే సై అంటోన్న కుల నేతలు, పోలీసులు అలర్ట్

ఈ సమావేశంలో తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత (vangalapudi anitha) పాల్గొన్నారు. భేటీ జరుగుతుండగా అనితకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అనిత.. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి సంభాషణ అందరికీ వినిపించారు. మీడియా ముందే అతనితో మాట్లాడారు. ఫోన్ చేసిన వ్యక్తి.. ఎంపీ గోరంట్ల మాధవ్‌  వ్యవహారంపై అతిగా స్పందించవద్దని అనితను హెచ్చరించాడు. దర్యాప్తు జరుగుతుండగా ఎందుకు అనవసరమైన చర్చ అని ప్రశ్నించాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే బాధ అనిపిస్తుందని చెప్పాడు.  ఇలాంటివి ఎన్నో జరుగుతుంటే కేవలం మాధవ్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని దుమ్ము లేపద్దని అన్నారు. తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృ‌ష్ణా రెడ్డి చెప్పారని అన్నారు. 

అయితే తాను వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెబుతున్నానని అనిత సమాధానం ఇచ్చారు. తప్పు చేస్తున్నారు కాబట్టే బాధ అనిపిస్తుందని అన్నారు. చేసిన తప్పును ఎలా సమర్థిస్తారని అనిత ప్రశ్నించాడు. నాలుగు గోడల మధ్య జరిగిందని సజ్జల అన్న మాటలు వినలేదా? అంటూ ఫోన్ చేసిన వ్యక్తిపై అనిత ఫైర్ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios