Asianet News TeluguAsianet News Telugu

కమ్మ VS కురుబగా మారిన గోరంట్ల మాధవ్ వ్యవహారం.. సై అంటే సై అంటోన్న కుల నేతలు, పోలీసులు అలర్ట్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం కమ్మ, కురుబ సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. కమ్మ కులాన్ని ప్రతిసారి టార్గెట్ చేస్తున్న మాధవ్ క్షమాపణలు చెప్పాలని నిన్న ర్యాలీ నిర్వహించారు కమ్మ సంఘం నేతలు. దీనికి కౌంటర్‌గా కమ్మ సామాజిక వర్గం చేపట్టిన ర్యాలీని వ్యతిరేకిస్తూ.. కురుబ సామాజిక వర్గం నేతలు మాధవ్‌కు మద్ధతుగా ర్యాలీ చేపట్టారు. 
 

kamma and kuruba leaders protest over ysrcp mp gorantla madhav video issue
Author
Hindupur, First Published Aug 7, 2022, 6:56 PM IST

వైసీపీ (ysrcp) ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ (gorantla Madhav) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తనపై కుట్ర చేసి ఇరికించారని గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ నేతలు పొన్నూరి వంశీ, చింతకాయల విజయ్‌లు ఈ వీడియో వెనుక వున్నారని ఆయన ఆరోపించారు. అయితే మాధవ్ వ్యాఖ్యలు కమ్మ, కురుబ కులాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. కమ్మ కులాన్ని ప్రతిసారి టార్గెట్ చేస్తున్న మాధవ్ క్షమాపణలు చెప్పాలని నిన్న ర్యాలీ నిర్వహించారు కమ్మ సంఘం నేతలు. దీనికి కౌంటర్‌గా కమ్మ సామాజిక వర్గం చేపట్టిన ర్యాలీని వ్యతిరేకిస్తూ.. కురుబ సామాజిక వర్గం నేతలు మాధవ్‌కు మద్ధతుగా ర్యాలీ చేపట్టారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీని అణగొక్కేందుకు న్యూడ్ మార్ఫింగ్ చేశారని నినాదాలు చేశారు. 

నిన్న కమ్మ సామాజిక వర్గం చేపట్టిన ర్యాలీలో ఎంపీ మాధవ్ చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టడాన్ని కురుబ సంఘం నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకుండానే మాధవ్ తప్పు చేశారని ఎలా నిర్ధారిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మాధవ్ వీడియో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. 

ALso Read:గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో : ‘‘ మీ వాళ్లు చేయలేదా ’’ .. కుప్పంలో టీడీపీ నిరసనను అడ్డుకున్న సీఐ

ఇకపోతే.. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల నిరసనను అడ్డుకునే సందర్భంలో అర్బన్ సీఐ ఓవరాక్షన్ చేశారు. ఇదేమి కొత్త కాదని.. ఇలాంటి వాళ్లు దండిగా వుంటారని గోరంట్లకు మద్ధతుగా మాట్లాడారు. మీవాళ్లు ఇలా చేయ్యలేదా అంటూ అడ్డంగా వాదించారు సీఐ. దేశాన్ని కాల్చండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ యూనిఫాంలో వుండి దేశాన్ని కాల్చండి అంటూ సీఐ వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అభ్యంతరం చెప్పింది. సీఐ శ్రీధర్, ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులని తెలుస్తోంది. తన స్నేహితుడిని వెనకేసుకుని వచ్చే ప్రయత్నంలో సీఐ రుసరుసలాడారు. వైసీపీ ఎంపీ మాధవ్‌పై చర్యలు కోరుతూ కుప్పంలో తెలుగు యువత నిరసనలకు సీఐ శ్రీధర్ అడ్డు తగిలారు. దిష్టి బొమ్మ తగులబెట్టడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు పోలీసులు. 

మరోవైపు.. వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంపై ఏపీ మహిళా కమీషన్ (ap women's commission) సీరియస్ అయ్యింది. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసింది. ఈ ఘటనలో త్వరగా నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీని కోరారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. మరోవైపు.. గోరంట్ల మాధవ్ తీరుపై ప్రతిపక్షాలతో పాటు మహిళా, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. ఏపీ వ్యాప్తంగా గత రెండ్రోజులుగా నిరసనకు దిగాయి. విశాఖలో తెలుగుదేశం మహిళా నేతలు గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అటు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పుట్టపర్తిలోని సత్యమ్మ గుడి వద్ద గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎంపీ మాధవ్ దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ.. ఆయనను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios