చీరాల సంఘటనలో కిరణ్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసిన ఎస్సై విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలపైనా చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు. దళితులపై వ్యాఖ్యలు చేసిన చింతమనేని ప్రభాకర్‌పై చర్యలు తీసుకోకపోగా ఆయనను చంద్రబాబు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారని సుచరిత ఎద్దేవా చేశారు.

Also Read:దళిత యువకుడిని బూటుకాలితో తన్నిన సీఐ... సస్పెండ్ చేసిన డీఐజీ (వీడియో)

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మహిళల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నామని హోంమంత్రి చెప్పారు. తాజాగా దళితుడిపై దాడి చేసిన కాశీబుగ్గ సీఐపై చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

రాష్ట్రంలో నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టాయని సుచరిత వెల్లడించారు. 2019 జూన్ వరకు 8 వేల కేసులు నమోదైతే.. 2020లో ఇప్పటి వరకు కేవలం 7 వేలు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసులు కూడా తగ్గాయన్నారు.