గుంటూరు జీజీహెచ్ లో కరోనా టీకా పంపిణీ  హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈకార్యక్రమంలో గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎమ్మెల్యేలు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

"

ఈ సందర్బంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. కరోనాతో ప్రపంచం స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శాస్త్రవేత్తల కృషితో టీకా సిద్ధం కావటం సంతోషం అన్నారు. మొదటిగా వైద్య ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తున్నామని తెలిపారు.

టీకా తీసుకున్న తర్వాత ఏమైనా సమస్యలు తలెత్తితే చికిత్స కోసం అత్యవసర విభాగం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా యాంటీ బాడీస్ తయారయ్యే వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఈ క్రమంలో మరోసారి గుర్తు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 31 కేంద్రాల్లో టీకా పంపిణీ జరుగుతుందని, రానున్న రోజుల్లో  మరిన్ని  టీకా కేంద్రాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.