అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పై దాడి కేసులో విచారణ జరుగుతోందన్నారు. 

దాడికి సంబంధించి విచారణ నిమిత్తం ప్రభుత్వం సిట్ ను నియమించిందని గుర్తు చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఆధారాలను సేకరించామని తెలిపారు. అటు పలువురిని విచారించినట్లు కూడా చెప్పుకొచ్చారు. దాడి కేసులో వాస్తవాలను త్వరలోనే వెలికి తీస్తామని చెప్పుకొచ్చారు. జగన్ పై దాడి కేసును ఏపీ సర్కార్, పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చినరాప్ప వెల్లడించారు.