అమరావతి: సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో  R5 జోన్ ఏర్పాటు పై  అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ  పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం మరో రెండు వారాలు గడువు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే  ఇప్పటికే 15 రోజులు గడువు ఇచ్చామని ప్రభుత్వం  తరపున వాదించిన అడ్వోకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. 

అయితే ప్రభుత్వ వివరణతో సంతృప్తిచెందని న్యాయస్థానంగ గడువును పెంచుతూ తానే స్వయంగా ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలు స్వీకరణకు మరో రెండు వారాలు గడువు ఇచ్చింది ధర్మాసనం. 

R5 జోన్ ఏర్పాటు పై ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకు  15 రోజులు గడువు ఇస్తూ గేజిట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. అయితే  హైకోర్టు కూడా మరో  రెండు వారాలు ఈ గడువు పొడిగించడంతో మొత్తం నెలరోజుల సమయం వచ్చింది.