జడ్జిలపై అభ్యంతరకర వ్యాఖ్యలు: సీబీఐ విచారణ తీరుపై ఏపీ హైకోర్టు అసంతృప్తి

జడ్జిలు, కోర్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ విచారణ తీరుపై ఏపీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.నిందితులపై తీసుకొన్న చర్యల విషయంలో కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సీబీఐ ఎస్పీని కోర్టు ఆదేశించింది.

AP High Court Unhappy on Cbi Investigation Over Social Media Posts Against Andhra Judges

అమరావతి: Judges, Courtలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో Cbi విచారణ తీరుపై ఏపీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ విషయమై రేపు జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ ఎస్పీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టిన విషయంలో నిందితులపై సీబీఐ అధికారులు తీసుకొన్న చర్యలపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభాకర్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుల విషయమై కూడ ఉన్నత న్యాయస్థానం సీబీఐని ప్రశ్నించింది. నిందితుల అరెస్ట్, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల తొలగింపు విషయంలో తీసుకొన్న చర్యలపై వివరణ ఇవ్వాలని సీబీఐ ఎస్పీని హైకోర్టు ఆదేశించింది.ఈ విషయమై రేపు జరిగే విచారణకు హాజరు కావాలని కూడ సీబీఐ ఎస్పీని Ap High court  ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చిన సమయంలో social Mediaలో కోర్టులు, జడ్జిలకు వ్యతిరేకంగా  కొందరు పోస్టులు పెట్టారు.ఈ  విషయమై హైకోర్టులో  పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు ఏపీ సీఐడీకి విచారణ బాధ్యతను అప్పగించింది. సీఐడీ విచారణ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం చివరికి ఈ కేసు విచారణను 2020 అక్టోబర్ 8వ తేదీన సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొంది.

ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో ఆదర్ష్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివరెడ్డి, సుధీర్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిపై ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఈ నెల 22న  అవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గుడా శ్రీధర్ రెడ్డి,  శ్రీనాథ్, కిషోర్, అజయ్, అమృత్‌ లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో స్టేటస్ రిపోర్టును ఈ నెల 6వ తేదీన హైకోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు.

Also read:జడ్జిలపై అభ్యంతకర వ్యాఖ్యలు: మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

ఏపీలో కోర్టులిచ్చిన తీర్పులపై అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు గతంలో చేసిన వ్యాఖ్యల గురించి హైకోర్టు సుధీర్ఘంగా విచారణ చేసిన తర్వాత విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు కూడ పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.ఈ విషయమై సీఐడీ  విచారణ విషయంలో హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీఐడీ స్థానంలో విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే సీబీఐ విచారణ తీరుపై కూడా  ఇవాళ ఏపీ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.

నిందితులు కొందరు విదేశాల నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సీబీఐ గుర్తించింది. అయితే విదేశాల్లో ఉన్న వారిని ఇండియాకు రప్పించే విషయమై కూడ సీబీఐ అధికారులు  పరిశీలిస్తున్నారు.ఈ కేసులో ఇంకా ఎంతమంది నిందితులున్నారనే విషయమై కూడ ఉన్నత న్యాయస్థానం ప్రశ్నిస్తోంది. విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించడానికి ఆయా దేశాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దిశగా సీబీఐ అధికారులు చర్యలు తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios