Asianet News TeluguAsianet News Telugu

Kondapalli municipality: కొండపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ఉద్రిక్తత.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ (kondapalli municipality)  చైర్‌పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. రెండో రోజు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ.. ఈ ఎన్నికకు సంబంధించి ఏపీ హైకోర్టులో (AP High Court) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 

high tension at Kondapalli municipality over municipal chairman election
Author
Kondapalli, First Published Nov 23, 2021, 12:29 PM IST

కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ (kondapalli municipality)  చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతుంది. సోమవారం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడంతో.. చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక నేటికి వాయిదా పడింది. ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 29 వార్డులకు గానూ.. టీడీపీ, వైసీపీలు చెరో 14 వార్డుల్లో విజయం సాధించాయి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన శ్రీలక్ష్మి.. ఆ తర్వాత టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఇక, ఇరు పార్టీలకు చెరో ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండటంతో.. మొత్తం టీడీపీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు ఉన్నాయి. టీడీపీ తరఫున విజయవాడ ఎంపీ కేశినేని నాని  (kesineni nani)‌ ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకోనున్నారు. 

అయితే కొండపల్లిలో పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా ఉన్నాయి. సోమవారం రోజునే ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైఎస్ చైర్మన్‌ల ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ చోటుచేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దానిని వాయిదా వేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఇందుకు సోమవారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విధ్వంసాలకు పాల్పడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ చేస్తున్న పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారని మండిపడ్డారు. 

Also read: Kondapalli municipality: వైసీపీ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తతలు.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

ఇక, రెండో రోజు కూడా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ (kondapalli municipal Chairman) ఎన్నిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ తరఫున ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంపీ కేశినేని నాని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు నిన్న చోటు చేసుకన్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే కొండపల్లి మున్సిపల్ ‌కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరగుతుందనే టెన్షన్ నెలకొంది. 

కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ హాల్‌కు చేరుకున్న వైసీపీ కౌన్సిలర్లు గొడవ చేస్తున్నారు. తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. వారి తీరును టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టాయి. ఎన్నిక ఆపడం తీవ్రమైన చర్యంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆర్వోకి తెలిపారు.
 

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. 
కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికపై ఏపీ హైకోర్టులో(AP High Court) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ ఎన్నికను సజావుగా జరిపించాలని టీడీపీ కోర్టును ఆశ్రయించింది. వైసీపీ ఈ ఎన్నిక జరగకుండా విధ్వంసానికి పాల్పడుతుందని లాయర్ అశ్వినీ కుమార్ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. సమావేశం నిర్వహించి సభ్యులు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు..  మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరుపనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios