Asianet News TeluguAsianet News Telugu

ఒక్క క్యారెక్టర్ నచ్చకపోతే.. మొత్తం నాటకాన్ని నిషేధిస్తారా? చింతామణి నాటకం బ్యాన్ పై ఏపీ హైకోర్ట్ సీరియస్..

చింతామణి bookని బ్యాన్ చేశారా? అని హై కోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు.

AP High Court Serious on Chintamani Drama Ban
Author
Hyderabad, First Published Feb 2, 2022, 2:01 PM IST | Last Updated Feb 2, 2022, 2:01 PM IST

అమరావతి : Chintamani drama నిషేధం వ్యవహారంలో ప్రభుత్వం మీద AP High Court సీరియస్ అయ్యింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్ర మీద అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ.. నాటకాన్ని ఎలా ban చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చింతామణి bookని బ్యాన్ చేశారా? అని హై కోర్టు ప్రశ్నించింది. 

చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం, ఇతర అధికారులు అందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఇదిలా ఉండగా, ఏపీలో Chintamani drama మీద ప్రభుత్వం జనవరి 18న నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుడదని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడో దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఇప్పటికీ ఊరూరా ప్రదర్శితమవుతూనే ఉంటుంది. 

ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింపబడింది. తాజాగా ఈ నాటకాన్ని రాష్ట్రంలో నిషేధించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. 

అయితే, దీనిమీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సుబ్బిశెట్టి పాత్ర కోసం నాటకం మొత్తాన్ని నిషేధిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నాటక సంఘాలు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో నాటక సంఘాలు సమావేశమయ్యాయి. తమతో సంప్రదించకుండా ఎలా నిషేధం విధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక పాత్ర కోసం చింతామణి నాటకంపై ఆధారపడే జీవితాలను రోడ్డున పడేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని నాటక సంఘాలు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రతో అశ్లీలత చూపించి చాలా పెద్ద తప్పు చేశాయన్నారు. అవసరమైతే సినిమాల లాగానే నాటకాలకు సెన్సార్ బోర్డు లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాని కళాకారుల కడుపు కొట్టద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక చింతామణి నాటకాన్ని బ్యాన్ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంద్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజాగా, ప్రముఖ ఆర్టిస్ట్ త్రినాథ్ పిల్(PIL) దాఖలు చేశారు. అరుగు త్రినాథ్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ పిటిషన్ వేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కళాకారులు రోడ్డున పడ్డారని ఆయన వాదించారు. అందుకే దీన్ని అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని కోరారు. మంగళవారం ఈ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించనుంది. చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 7ను సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios