Asianet News TeluguAsianet News Telugu

మా ఆదేశాలు లెక్కలేదా... రఘురామను జైలుకెందుకు తరలించారు: సీఐడీపై ఏపీహైకోర్ట్ ఆగ్రహం

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ పూర్తయ్యింది. రఘురామ మెడికల్ రిపోర్ట్‌ను కూడా హైకోర్టుకు పంపింది జిల్లా కోర్టు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. 

ap high court serious on ap cid officials on raghurama krishnam raju ksp
Author
Amaravathi, First Published May 16, 2021, 6:47 PM IST

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ పూర్తయ్యింది. రఘురామ మెడికల్ రిపోర్ట్‌ను కూడా హైకోర్టుకు పంపింది జిల్లా కోర్టు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. మరోవైపు ఖైదీ నెం3468ను కేటాయించారు జైలు అధికారులు.

అలాగే పాత బ్యారక్‌లో ఓ సెల్‌ను కేటాయించారు. హైకోర్టులో వాదనల సందర్భంగా రఘురామ తరపు న్యాయవాదులు.. కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో వైద్య పరీక్షలు చేసి జైలుకు తరలించారని తెలిపారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం రఘురామను ఎందుకు జైలుకు తరలించారని ప్రశ్నించింది. అయితే మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారమే జైలుకు తరలించామని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అయితే ప్రభుత్వాసుపత్రిలో పరీక్షల తర్వాత ఎంపీని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారా అని హైకోర్టు.. పోలీసులను ప్రశ్నించింది.

Also Read:గుంటూరు జైలులో... ఖైదీ నెం 3468గా రఘురామకృష్ణంరాజు

హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి సీఐడీ కోర్టు ఆదేశాలను ఎలా అమలు చేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఆసుపత్రిలో వున్న ఎంపీ దగ్గరకు సీఐడీ చీఫ్‌ను అనుమతించడంపై రఘురామ లాయర్ల అభ్యంతరం తెలిపారు. అసలు సీఐడీ చీఫ్ ఎందుకెళ్లారు, మెడికల్ బోర్డు ఎలా అనుమతించిందని హైకోర్టు ప్రశ్నించింది.

మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం సీఐడీ కోర్ట్ ఆదేశాలు రీకాల్ చేయాలని రఘురామ తరపు న్యాయవాదులు కోరారు. మేం ఆదేశాలిచ్చాక, సీఐడీ  కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందా, ముందు ఇచ్చిందా అని హైకోర్టు ప్రశ్నించింది. సీఐడీ కోర్టే ముందు ఆదేశాలు ఇచ్చిందని రఘురామ తరపున న్యాయవాదులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios