జీవో నెంబర్ 1: తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
జీవో నెంబర్ 1పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. జీవో నెంబర్ పై నిన్న, ఇశాళ కూడ ఏపీ హైకోర్టు వాదనలను విన్నది.
హైదరాబాద్: జీవో నెంబర్ 1పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. జీవో నెంబర్ పై ఇరువర్గాల వాదనలను హైకోర్టు విన్నది.రోడ్లపై రోడ్ షోలు, సభలు, సమావేశాలు , నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని ఈ నెల రెండో తేదీన తీసుకు వచ్చింది. జీవో నెంబర్ 1ని సవాల్ చేస్తూ ఈ నెల 12న సీపీఐ ఏపీ రాస్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ వెకేషన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ జీవో నెంబర్ 1ని ఈ నెల 23వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. నిన్న ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణ చేసింది. ఇదే సమయంలో ఈ పిటిషన్ పై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు ఇంప్లీడ్ అయ్యాయి.
ఈ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ విచారించడంపై ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
జీవో నెంబర్ 1పై సస్పెన్షన్ ను కొనసాగింపునకు పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్ధించారు. అయితే సస్పెన్షన్ ను కొనసాగించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై ఇంప్లీడ్ అయిన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేయాలని టీడీపీ తరపు న్యాయవాది వాదించారు. జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
also read:జీవో నెంబర్ 1 సస్పెన్షన్ కొనసాగింపునకు ఏపీ హైకోర్టు నిరాకరణ: విచారణ రేపటికి వాయిదా
గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన కందుకూరులో, ఈ నెల 1 వ తేదీన గుంటూరులో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మృతి చెందారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము జీవో నెంబర్ 1ని తీసుకు వచ్చినట్టుగా వైసీపీ ప్రకటించింది. విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని విపక్షాలు విమర్శించాయి.