కోర్ట్ ధిక్కార నేరం కింద ఐఏఎస్‌లు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరిలకు విధించిన జైలుశిక్షను ఏపీ హైకోర్ట్ రీకాల్‌ చేసింది. హైకోర్టు ఉత్వర్వులను రేపు సాయంత్రంలోగా అమలు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానానికి లిఖితపూర్వక హామీనిచ్చారు. 

కోర్ట్ ధిక్కార నేరం కింద ఐఏఎస్‌లు గిరిజా శంకర్, చిరంజీవి చౌదరిలకు విధించిన జైలుశిక్షను ఏపీ హైకోర్ట్ రీకాల్‌ చేసింది. హైకోర్టు ఉత్వర్వులను రేపు సాయంత్రంలోగా అమలు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానానికి లిఖితపూర్వక హామీనిచ్చారు. దీంతో జైలు శిక్షను హైకోర్టు రీకాల్ చేసింది. అయితే జైలుశిక్ష తీర్పును హెచ్చరికగా పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Also Read:కోర్ట్ ధిక్కరణ నేరం: ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. ఏపీ హైకోర్ట్ సంచలన ఆదేశాలు

అంతకుముందు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లకు వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 36 మంది ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని ఏప్రిల్‌లో కోర్టు తీర్పు వెలువరించింది. అయితే తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కోర్ట్ ధిక్కరణ నేరంగా పరిగణిస్తూ ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది.