కోర్టు ధిక్కరణ నేరంపై ఇద్దరు ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలుశిక్ష విధించింది. చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లకు వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని ఏప్రిల్‌లో కోర్టు తీర్పు వెలువరించింది. 

కోర్టు ధిక్కరణ నేరంపై ఇద్దరు ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలుశిక్ష విధించింది. చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లకు వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని ఏప్రిల్‌లో కోర్టు తీర్పు వెలువరించింది. అయితే తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కోర్ట్ ధిక్కరణ నేరంగా పరిగణిస్తూ ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.