ఏపీ హైకోర్టు షాక్: ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం నాడు కొట్టేసింది.

ap high court quashes petition to stop local body election's notification lns

అమరావతి: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం నాడు కొట్టేసింది.2019 ఎలక్ట్రో జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించడం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు. 

 

2019 ఎలక్టోరల్ జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల రాష్ట్రంలో సుమారు 3 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు.ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

also read::

పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.గుంటూరుకు చెందిన అఖిల అనే విద్యార్ధిని ఎలక్టోరల్ జాబితా విషయమై పిటిషన్ దాఖలు చేశారు.

మరో వైపు విశాఖకు చెందిన న్యాయవాది కూడ నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు.  మరోవైపు ప్రభుత్వం కూడ  ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది.గత మాసంలో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. గత నెల చివర్లో ఎన్నికల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేసింది ఎస్ఈసీ. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios