YS Vivekananda Reddy Murder Caseలో సీబీఐకి హైకోర్టు షాక్: గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

AP High Court quashes  of CBI petition Gangi reddy bail cancel

అమరావతి:మాజీ మంత్రి YS Vivekananda Reddy హత్య కేసులో నిందితుడిగా ఉన్న Gangi Reddy బెయిల్ ను రద్దు చేయాలని CBI  దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.

ఈ హత్య కేసులో గంగిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో  అరెస్టైన గంగిరెడ్డి bail  పై విడుదలయ్యారు. అయితే  బెయిల్ పై ఉన్న గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ ఆరోపిస్తుంది.గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే ఈ విషయమై విచారణ సమయంలో సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని చెప్పేందుకు ఆధారాలు లేవని గంగిరెడ్డి తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు..ద అయితే గంగిరెడ్డి  సాక్షులను బెదిరించాడా , బెయిల్ షరతులు ఉల్లంఘించాడా అనే విషయమై హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ విషయమై సీబీఐ తరపు న్యాయవాది మాత్రం కోర్టుకు ఆధారాలను చూపలేకపోయింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు సీబీఐ పిటిషన్ ను కొట్టివేసింది.

2019 మార్చి 14 వ తేదీ రాత్రి  వైఎస్ వివేకానందరెడ్డిని స్వగృహంలోనే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసు విచారణను  సీబీఐ చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారాడు.వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టేసింది. దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అప్రూవర్ గా మారుతున్నట్టు దస్తగిరి ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు వేసిన పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.  దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల తరఫు వాదనలను తోసిపుచ్చింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఖరారు చేసింది. చట్టప్రకారం సీబీఐ ముందుకెళ్లొచ్చని తెలిపింది. 

 వివేకా హత్యకు సంబంధించిన సంచలన విషయాలను  దస్తగిరి సిబిఐ అధికారులకు  ఓ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఎర్ర గంగిరెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడని ఉమా శంకర్ రెడ్డి  తనకు చెప్పినట్టు దస్తగిరి పేర్కొన్నాడు. అంతేకాదు హత్య జరిగిన తర్వాత తనతో సహా కొంతమందిమి శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు అప్పుడు కూడా తమకేమీ సమస్య రాకుండా ఎర్ర గంగిరెడ్డి చూసుకుంటారని శంకర్ రెడ్డి హామీ ఇచ్చారని దస్తగిరి పేర్కొన్నాడు. 

ఎర్ర గంగిరెడ్డి, Sunil Yadav, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి  సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు దస్తగిరి ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. MLC ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు దస్తగిరి  ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios