Asianet News TeluguAsianet News Telugu

జగన్‌ సర్కార్‌కి షాక్: ఇన్‌సైడర్ కేసుల కొట్టివేత

రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని కిలారి రాజేష్ సహా మరికొందరిపై పెట్టిన కేసులను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.

AP High court quashes insider trading cases lns
Author
Guntur, First Published Jan 19, 2021, 1:38 PM IST


అమరావతి:  రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని కిలారి రాజేష్ సహా మరికొందరిపై పెట్టిన కేసులను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కొట్టేసింది.

రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని  ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అంతేకాదు  కొందరిపై కేసులు కూడ పెట్టింది. దీంతో కిలారి రాజేష్ సహా కొందరు ఈ విషయమై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

also read:ఏపీలో స్థానిక సంస్థలు: ఉద్యోగులకు షాకిచ్చిన హైకోర్టు

ఈ విషయమై క్వాస్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.  ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు మంగళవారం నాడు కీలక తీర్పును వెలువరించింది.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసిన విషయమై విచారణ సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూములు విక్రయించిన వారెవ్వరూ కూడ ఫిర్యాదు చేయలేదని కిలార్ రాజేష్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ లో ఐపీసీ సెక్షన్లు వర్తించవని  పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొంది హైకోర్టు.  రాజేష్ తదితరులపై పెట్టిన కేసులను కొట్టివేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios